TRINETHRAM NEWS

Ricky among contract workers, share in profits, Director (Pa) petition PSCWU-IFTU

షరతులు లేకుండా,5,వేలు ఇవ్వాలి

సిపిఐ (మాల్ ) మాస్ లైన్ అనుబంధ సంఘం ప్రగతిశీల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, ఐ ఎఫ్ టి యు ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెం, సింగరేణి డైరెక్టర్ (పా) వెంకటేశ్వర రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈవినతి పత్రం కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, షేక్ యాకుబ్ షావలి, కొత్తగూడెం రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు, ఆర్ మధుసూదన్ రెడ్డి, పెద్ద బోయినసతీష్ వివరిస్తూ సింగరేణి చరిత్రలో కాంట్రాక్టు కార్మికులకు లాభాలలో వాటా ప్రకటన చేయడం

సింగరేణిలో గుర్తించదగిన విషయమన్నారు. సింగరేణిలో విప్లవ కార్మిక సంఘాలతో పాటు అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం సింగరేణి మీద ఒత్తిడితోనే ఈ ప్రకటన చేయవలసి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం గత చైర్మన్ మీదా అనేక రకాల ఒత్తిడి చేసిన పెడచెవిన పెట్టారని అన్నారు. అందుకనే సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు కూడా గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టారని గుర్తుచేశారు
.
సింగరేణి ఓబి, కన్వీనియన్స్, కోల్ ట్రాన్స్పోర్ట్ వేబ్రిడ్జ్, లోడింగ్ అన్లోడింగ్,సులబ్ సోలార్, ట్యాగ్ సిస్టం తదితర సింగరేణిలోనీ అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులకు ఏషరతులు విధించకుండా పేచీలు, పెట్టకుండా, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ లాభాలలో వాటా ప్రకటించినందుకు వివాదం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులకు ఒక్కొక్కరికి 5,000వేల రూపాయలు అందే విధంగా చూడాలని సింగరేణి అధికారులకు విజ్ఞప్తిచేశారు.
ఈహక్కును ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నా కాంట్రాక్టు కార్మికులకు,రేవంత్ రెడ్డి పజాప్రభుత్వంలో కాంట్రాక్టు కార్మికులకోసం లాభాలలో వాటా కేటాయించడాన్ని చూస్తే కార్మికుల మీద మంచిసదాభిప్రాయంతో సానుకూలంగా కనిపిస్తున్నట్టుగా కార్మి కులు భావిస్తున్నారని అన్నారు గతఏడు సంవత్సరాలుగా సింగరేణిలో కాంట్రాక్ట్, కార్మికుల జీతాలు పెరగలేదన్నారు.

ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 22 కు గెజిట్ విడుదల చేసి జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.ఈ వినతి పత్రంకార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ricky among contract workers, share in profits, Director (Pa) petition PSCWU-IFTU