TRINETHRAM NEWS

డీడీఎంఎస్ నిబంధనలకు లోబడే బ్లాస్టింగులను నిర్వహించాలని RG -1 జిఎం వినతి పత్రం అందజేసిన

డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఎండీ. ముస్తఫా…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఓపెన్ కాస్ట్ 5లో బొగ్గును వెలికి తీసేందుకు జరుపుతున్న బ్లాస్టింగులు డీడీఎంఎస్ నిబంధనలకు లోబడే ఉండాలని, దాంతోపాటుగా ప్రభావిత డివిజన్ల లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని మరియు వివిధ సమస్యలపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎండి ముస్తఫా మాట్లాడుతూ, వివిధ వర్గాల ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వాటి పరిష్కారానికై ఆదేశించడంతో పాటు ఒసిపి-5 ప్రాజెక్టులో డిడిఎంఎస్ షరతుల పరిధి మేరకే బ్లాస్టింగులను నిర్వహించాలని, దానితోపాటుగా ప్రభావిత డివిజన్లో వివిధ సమస్యలపై ఈరోజు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించడంతో పాటు, త్వరితగతిన సమస్యలు పరిష్కారానికై సంబంధిత అధికారులకు వెనువెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని,

ముఖ్యంగా ప్రతిరోజు నిర్వహించే బ్లాస్టింగ్ ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లగా సత్వరమే డిడిఎంఎస్ నిబంధనలకు లోబడి బ్లాస్టింగ్లు నిర్వహించాలని, సంభందిత అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, గతంలోనే ప్రభావిత డివిజన్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలు తోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మున్ముందు అలాంటి కార్యక్రమాలు రెట్టింపు చేస్తామని, నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలు, వాల్వో డ్రైవర్ల ట్రైనింగు మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నామని అతి త్వరలో మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తెలిపారని ఒక ప్రకటనలో తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App