TRINETHRAM NEWS

నెలకంటి రాము ఆధ్వర్యంలో 30 వ డివిజన్ లోని 25 నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పండుగ సామాగ్రి పంపిణీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక 30 వ డివిజన్ లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ ను పురస్కరించుకొని వారికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు నెలకండి రాము ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణుల 25 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పండుగ సామాగ్రి రాము చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నెలకంటి రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే వారి కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని వారి యొక్క ఆదేశాలను సామాజిక బాధ్యత తో ఎవరికి సహాయం కావాలన్నా సైనికుడిలా ముందుండి సేవ చేస్తామని ఈ సందర్భంగా అన్నారు
ఈ కార్యక్రమంలో 30 వ డివిజన్ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు బోడకుంట రజిత బొంత వెంకటేష్ దాసరి దుర్గరాజ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RFCL Contract Workers Union