TRINETHRAM NEWS

Trinethram News : కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ నేడు సమీక్షించనున్నారు.

జలసౌధలో జరిగే ఈ సమీక్షకు సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, నిధుల వివరాలు, అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు, తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించనున్నారు…