TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : నగరవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనపడతాయి. ఒక్కోసారి ముందుకు వెళ్లాంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే దీన్ని అధికమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. నగరవాసుల కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి సర్కా్ర్ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంపీ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌ల నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ మేరకు రూ.1,090 కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 24 వరకూ బిడ్ వేసుకోవచ్చని బల్దియా ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. మార్చి 10న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రి బిడ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 26న బిడ్ ప్రైజ్ ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో నగరవాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పినట్లు అయ్యింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

traffic problems