TRINETHRAM NEWS

దేశం లో ఎక్కడా లేని విధంగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రం లో, బీసీ కులగణన మరియు రీ సర్వే చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తూ పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానించడం జరిగింది.
కృతజ్ఞతా పూర్వకంగా త్వరలో బస్ యాత్ర తో సీఎండీ బలరాం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడానికి తీర్మానం చేయడం జరిగింది సింగరేణి లో బిసి దీర్ఘకాల సమస్యలు, సింగరేణి బీసీ చీఫ్ లైజన్ ఆఫీసర్ నియామకం సింగరేణి చరిత్ర లో మొట్టమొదటిది, కొత్తగూడం లో బీసీ అసోసియేషన్ కొరకు క్వార్టర్ అలాట్ చేయడం మరియు బీసీ వర్గానికి చెందిన నూతన డైరెక్టర్ లు శ్రీ ఎల్వీ సూర్యనారాయణ కొప్పుల వెంకటేశ్వర్లు నియమించినందుకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానం చేయడం జరిగింది
అన్ని ఏరియా లలో బీసీ అసోసియేషన్ కార్యాలయ నిర్వహణ కోసం క్వార్టర్ లు అలాట్ చేయడం, అన్ని ఏరియా లకి లైజన్ ఆఫీసర్లను నియమించాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో రామగుండం ఓసీ 5 లో జరుగుతుందని తెలిపారు
సింగరేణి బీసీ ఎంప్లాయిస్ అందరూ సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకత పెంచే దిశగా, కంపెనీ అభివృద్ధి కొరకు పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది
సింగరేణి బీసీ ఎంప్లాయిస్ సమస్యలు తీర్చేవారికి పూర్తి మద్దతు ఉంటుందని తీర్మానించారు.
ఈ మీటింగ్ లో సింగరేణి బీసీ అసోసియేషన్ అడ్వైజర్ చిల్కా శ్రీనివాస్ ప్రెసిడెంట్ పూస వసంత్ కుమార్ జనరల్ సెక్రటరీ దేవాచారి, ట్రెజరర్ దేవులపల్లి రాజేందర్ మ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Singareni BC Employees Association