TIRUMALA : ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల కానున్నాయి. 2024, మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది..
ఈరోజే మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. ఇప్పటికే మార్చి నెలకు సంబంధించి శ్రీవారి ట్రస్ట్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. టికెట్లు బుక్ చేసుకునేందుకు సైట్ : ttdevasthanams.ap.gov.in/ వినియోగించుకోవాలని టీటీడీ వెల్లడించింది..