
Trinethram News : UAE :మార్చి 28. రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నాహ్యాన్ అక్కడి జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. 1,295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు 1,518 మందికి క్షమాభిక్ష ప్రసా దించాలని నిర్ణయించు కున్నారు విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారు.
ఈద్ కోసం దేశం.. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈద్ దృష్ట్యా, యుఎఇ జైళ్లలో ఉన్న ఖైదీలకు జీవితాన్ని గడపడానికి రెండవ అవకాశం ఇస్తోంది.
దీనిని ఫిబ్రవరి చివరిలో ప్రకటించారు. ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించిన వారిలో 500 మంది భారతీయ ఖైదీలు ఉండగా.. వారి కుటుం బాల్లో ఆనందం నిండు కుంది…
యుఎఇ ఆదేశాన్ని అను సరించి, ఈ సంవత్సరం ఈ భారతీయులు తమ కుటుంబాలతో ఈద్ జరుపుకోగలుగుతారు…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
