
రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకుడి కుటుంబానికి 9000/- వేల రూపాయలు నిత్యావసర సరుకులు అందజేత
సామాజిక సేవ కోసమే రెహమాన్ ఫౌండేషన్ : చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని
Trinethram News : లింగాపూర్ : నేడు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకుడైన జాధవ్ మారుతీ తండ్రి గారైన స్వర్గీయ జాధవ్ లాలు నాయక్ (52) గత కొద్ది రోజుల క్రితం స్వర్గస్థులైనారు. దశదిన పెద్దకర్మ (తేర్వి) కార్యక్రమం కోసం రెహమాన్ ఫౌండేషన్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ బృందం సభ్యులు రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ ఆదేశాల మేరకు మంగళవారం 9000/- రూపాయల నిత్యావసర సరుకులు కుటుంబ సభ్యులైన సతీమణి జాధవ్ ఝాలిబాయి, కుమారుడు జాధవ్ మారుతికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సహాయాన్ని అందించడం జరిగిందని లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ప్రతి పేద కుటుంబాలకు రెహమాన్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాధవ్ సుశీల్, ఆడే సంజీవ్, జాధవ్ గజానంద్, దవనే విశ్వకాంత్, రాథోడ్ కిషన్, రాథోడ్ ధర్మెందర్, రాథోడ్ నరేందర్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు.!!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
