
డిండి (గుండ్ల పల్లి) మార్చి 31 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఈద్గా ఏ ఖాధ్రియా లో మత పెద్దలు , ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. పండితులు నా జోరుల్ హక్ గారు రంజాన్ కి సంబంధించిన నమాజ్ చదువు పీయడం జరిగింది. పెద్దలు పిల్లలు ఒకరికి ఒకరు ఆలీనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పండితులు పవిత్ర రంజాన్ మాసం గురించి క్లుప్తంగా వివరించడంతో సహా ఈ మాసంలో 30 రోజులు ఉపవాస దీక్షలు చేయడం అదృతంగా భావించాలని అన్నారు. దిండి పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఉమర్ మాట్లాడుతూ ఈ రంజాన్ వేడుకలకు సంబంధించి హిందూ ముస్లిం లు కలిసిమెలిసి సోదర భావంతో సమానత్వం సమైక్యత స్ఫూర్తిని నింపే విధంగా రంజాన్ వేడుకలలో ఉంటాయని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో ఖాద్రీయ మజీద్ ఇమామ్ నజ్ర లుల్ హక్, మైనార్టీ పెద్దలు అబ్దుల్ రజాక్, పీర్ మహమ్మద్, అబ్దుల్ కలీం, మహమ్మద్ రషీద్, మహమ్మద్ జహంగీర్, అబ్దుల్ ఖాదర్, ఖయ్యాం, కమిటీ సభ్యులు జవ్వాద్, సలీం, రహమాన్, నాసిర్, షేక్ రహీం, మూసా ఇస్మాయిల్, రహమతుల్లా, ముజాహిద్ ఖాన్, అయ్యూబ్, చాంద్ పాషా, నిరంజన్, బాబా, అబ్దుల్లా, అలీమ్, మహమ్మద్, రిజ్వాన్, మరియు ముస్లిం మైనార్టీ పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా దగ్గర బందోబస్తుకు వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు మరియు సిబ్బందికి ముస్లిం సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
