
జైపూర్ మండలం వేలాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్.,(ఐజి) జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామి ని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపిఎస్., లతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖ ల సమన్వయం తో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకి వచ్చిన భక్తులు వంట వండుకోవడానికి వెలిగించిన పొయ్యిలు వంట అయిపోగానే వెంటనే ఆర్పీ వేయాలి. అదేవిదంగా బోనాలు వండి దీపాలు పెట్టడం జరుగుతుంది చుట్టూ ఎండిన గడ్డి ఎండిన ఆకులు ఉన్నాయి కావున అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది గనుక జాగారం ఉండేవారు తప్పకుండా తెలివితో ఉండి దీపాలను గమనిస్తూ ఉండాలని, ఈ విషయం లో ప్రజలు కూడా సహకరించాలని సిపి భక్తులకు ప్రజలకు సూచించారు.
ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి వరుస పద్ధతిలో అనుమతించడం జరుగుతుందని, దర్శనం కి వచ్చి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ప్రజలు, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుని శీఘ్ర దర్శనం జరిగింది అని ఒక మంచి అనుభూతి తో ఆనందం గా వెళ్లే లాగా చూడాలి అని అధికారులకు సూచించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్వహించడం జరిగింది అని తిరిగి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని అధికారులకు సూచించారు అన్నారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐ శ్రీరాంపూర్ వేణు చందర్, ఆర్ ఐ సంపత్, ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
