
ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో గిరిజన హమాలీల సమస్యల పరిష్కారం కోసం ర్యాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా పాడేరులో ఏఐటియుసి, ఆధ్వర్యంలో గిరిజన హమాలీల సమస్యల పరిష్కారం కోసం నిరసన ర్యాలీ. పాడేరు ఐటిడిఏ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకుజరిగింది. గిరిజన ప్రాంతంలో జిసిసిల వద్ద విధులు నిర్వహిస్తున్న హమాలీలు తమ సమస్యలు పరిష్కారం కోసం భారీ ర్యాలీ నిర్వహించారు.
జిసిసిల వద్ద పనిచేస్తున్న కళాశాల అని భారం అధికమవడం కారణంగా వారి పనికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని, జిసిసి వాహనాలు వద్ద లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న పనులకు సంబంధించి పర్సెంటేజ్ పెంచాలని, కళాశీలను ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలంటూ, విధులు చేస్తున్న సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని,
అధిక బరువులు ఎత్తటం, భోజనం సకాలంలో తినక పోవటం వల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుందని, వృద్ధాప్య రుసుముగా అదనంగా లక్ష రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కే రహమాన్, ఏఐటీయూసీ నాయకులు కాసుబాబు, ఎస్ రమణ, సిహెచ్ సాయికుమార్, మేస్త్రీలు పేరయ్య, సత్తిబాబు, పరశురాం, బలరాం, బాబురావు, నీలకంఠం, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
