శ్రీశైలం : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు. 8 నందులు, వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణు, దుర్గ, లింగోద్భవ శివుడి మూర్తులు కనువిందు చేస్తున్నాయి. శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు. దాతలు శుక్రవారం ఈ రథాన్ని దేవస్థానానికి అప్పగించిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దానిని ప్రారంభిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. సుమారు రూ. 11 కోట్ల వ్యయంతో ఈ స్వర్ణరథాన్ని తయారు చేయించినట్లు సమాచారం….
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు
Related Posts
ఉచితంగా ప్లాట్లు
TRINETHRAM NEWS తేదీ : 18/01/2025.ఉచితంగా ప్లాట్లు.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్లు స్థలాలు ఇస్తానని ప్రకటించిన విషయం ప్రజలకు తెలిసిందే అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం శాసనసభ్యులు…
తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు
TRINETHRAM NEWS తేదీ : 18 /01/ 2025.తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపడమర ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి…