మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి మారిందా?
ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు దెబ్బ తప్పదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
తొలిసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఆమె.. సిట్టింగ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించారు. విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.
కానీ ఇప్పుడు జగన్ ఆమెకు స్థానచలనం కల్పించడంతో.. కక్కలేక మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సీఎం జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కానీ బయట పెట్టలేని స్థితి ఆమెది.
అయితే చిలకలూరిపేట టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి రజిని ఎలా ముందుకు వెళతారో చూడాలి.