సినీ రంగానికి రారాజు దాసరి నారాయణ రావు
భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో గురువారం మచిలీపట్నం కృష్ణా జిల్లా గ్రంథాలయంలో “దర్శక కేసరి దాసరి” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక రచయిత నందం హరిచంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. హరిచంద్ర ప్రసాద్ దాసరి తనకు గల సానిహిత్యాన్ని తెలియపరిచారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్న దాసరి 250 సినిమాలకు మాటలు వ్రాసిన ఘనుడన్నారు. సినీ రంగాన్ని హైదరాబాదు నుండి మద్రాసు తరలించడంలో దాసరి చేసిన కృషి అభినందనీయ మన్నారు. ఎన్నో కుటుంబ, దేశభక్తి, ప్రేమ సినిమాలను నిర్మించిన దాసరి సినీ రంగంలో దాసరి ఆదర్శప్రాయం అన్నారు. ఎందరో హీరోలు హీరోయిన్లు ప్రోత్సహించే దాసరి తన పదవికి వన్నె తెచ్చారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసిన దాసరి జీవిత చరిత్ర పుస్తక రూపంలో అందించడంలో తన అదృష్టం అని హరిచంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షఁలు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో దాసరి పాత్ర చిరస్థాయిగా మిగిలిపోతుందని అన్నారు. దాసరి తెలుగు భాషతో పాటు వివిధ భాషల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహిత్య పరిషత్ అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినీ రంగంలో దాసరి వంటి వ్యక్తులు ఆరుదు అని అన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం తమ సంస్థకు దక్కినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సాహిత్య పరిషత్తు కార్యదర్శి ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ దాసరి తాను ఎదుగుతూ కొన్ని వందల మంది ఎరుగుదలకు కారకులయ్యారని అన్నారు. తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో సినీ కళాకారులతో కలిసి ఎందరో అభాగ్యులను ఆదుకున్న మహా మనిషి దాసరి అన్నారు. ప్రముఖ సాహిత్య వేత్త సవరం వెంకటేశ్వరరావు పుస్తకాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం చెందిన సాహితీ మిత్రులు కంచర్లపల్లి కృష్ణమోహన్, రామ్మోహన్రావు, భవిష్య, పి.సాంబశివరావు, మేరీ కృపా భాయి కాగిత సాంబశివరావు దాసరి జీవితం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కమ్మిలి విజయకుమార్ సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.