వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత ను నిర్దారించడానికి జిల్లా కలెక్టరెట్ కార్యాలయం లో వర్షా పాతం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు*.వర్షం కారణంగా ఆస్తి నష్టం, రోడ్లు ముసుకు పోవడం, ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరుగకుండా ఏవైనా పరిస్థితు లను ఎదుర్కొంటున్న యువత సహాయం కోసం వెంటనే కంట్రోల్ రూమును సంప్రదించాలని అయన కోరారు.కంట్రోల్ రూమ్ ను సంప్రదించు నెంబర్లు
08416-242136
7995061192
పై తెలిపిన నెంబర్ లకుసంప్రదించాలని కలెక్టర్ కోరారు. జిల్లా యంత్రాంగం పరిస్థితి ని చురుకుగా పర్యవేక్షస్తుందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని,రెండు మూడు రోజుల్లో వర్షాల ప్రభావం వల్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలని, ప్రభుత్వం జారీ చేసిన భద్రత మార్గ దర్శకాలను పాటించాలని కలెక్టర్ సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


