TRINETHRAM NEWS

రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

Trinethram News : లింగాపూర్ : ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలోని రాథోడ్ అనుషా బాయి నరేందర్ నిరుపేద దంపతుల ప్రథమ పుత్రిక రాథోడ్ నందిని కుషాల్ గార్ల వివాహ వేడుకలు సంస్కృతి, సాంప్రదాయల నడుమ వేద మంత్రాలతో ఆదివారం ఘనంగా జరిగాయి. ఆడబిడ్డ పెళ్లి విషయాన్ని లింగాపూర్ మండల ఇంచార్జి జా దవిత్ కుమార్ రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని వివరించగా చైర్మన్ గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని లింగాపూర్ రెహమాన్ ఫౌండేషన్ ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా ఆడబిడ్డ కుటుంబ సభ్యులకు అందించి ఆర్థిక భరోసాగా నిలవడం జరిగింది. అనంతరం సభ్యులు వధూవరులను పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లి కార్యానికి సహయం చేయాలనే సామాజిక సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని రెహమాన్ ఫౌండేషన్ సభ్యులన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు జాధవ్ కైలాష్, జాధవ్ అజేష్ కుమార్, జాధవ్ రజిత్ కుమార్, ఆడే కేతన్ నాయక్, జాధవ్ వికాస్, రాథోడ్ లఖన్, రాథోడ్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు…!!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rahman Foundation, which stands