TRINETHRAM NEWS

టూ వీలర్ పై సుడిగాలి పర్యటన నిర్వహించిన ఎమ్మెల్యే గోరంట్ల

Trinethram News : మౌలిక సదుపాయాలు ఏర్పాటులో భాగంగా గ్రామంలో జరుగుతున్న రోడ్లు, డ్రైన్లు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈరోజు పిడింగొయ్యి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి టూవీలర్ పై ఎమ్మెల్యే గోరంట్ల సుడిగాలి పర్యటన నిర్వహించి, గ్రామంలో నూతనంగా నిర్మాణం జరిగిన అనేక రోడ్లను పరిశీలించారు.

ఆ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వద్దకు చేరుకొని, ఎంతో కాలంగా కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే తమ గ్రామంలో అనేక రోడ్లను నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో త్వరలో మొదలు పెట్టబోయే డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, ఫ్యూచర్ కిడ్స్ చైర్మన్ యేలేటి రవిబాబు, మట్ట శ్రీనివాస్, ముప్పిడి రాంబాబు, కోరాడ వెంకటేష్, మరకుర్తి వెంకటేశ్వరరావు, చిచ్చారి సుబ్బారావు, బత్తుల శివ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Gorantla