
ఎంపీ డి ఓ ఎస్ పి వెంకన్న
డిండి (గుండ్ల పల్లి) మార్చి 25 త్రినేత్రం న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా మండల పరిధిలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో 1-4- 2023 నుండి 31-4-2024వరకు జరిగిన ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీ విభాగం ఆధ్వర్యంలో 27-03-2025 న ప్రజవేధికలో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ మండల అభివృద్ధి అధికారి ఎస్పీ వెంకన్న ఒకప్రకటనలో తెలియ జేశారు.
తేది17-03-2025నుండి 26-03- 2025 వరకు 14వవిడత సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నారని , మండల వ్యాప్తంగా చేపట్టిన పనులపై వేతన చెల్లింపు తేది 27-03-2025న ఉదయం 10 గoటలకు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజావేధికలో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజాప్రతినిధులు ,అధికారులు ,వివిధ గ్రామాల లబ్ధిదారులు సకాలంలోహాజరు కాగలరని ఆయన (ఎంపిడిఓ)కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
