వైసిపి లీడర్ నానికి…కేశినేని శివనాథ్ (చిన్ని) కౌంటర్..
జగన్ కంటే పెద్ద సైకో ఎంపి నాని
నమ్మిన వాళ్లను ముంచే మనస్తత్వం
ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని పైసా వసూలు
తాడేపల్లి ఫ్యాలెస్, కేశినేని భవన్ వదిలి పోయేది వాళ్లే..
ఎంపి నానికి ఇవే చివరి ఎన్నికలు
డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీడియా ముందుకి బాధితులు..
విజయవాడ : విజయవాడ ఎంపి నాని ఉసరవెల్లి వేషాలు జగన్ కి బాగా అర్ధమైయ్యాయి. జగన్ ఒక సైకో అయితే అంతకు మించిన సైకో ఎంపి నాని అంటూ విజయవాడ పార్లమెంట్ టిడిపి నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఘాటు విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ పై ఎంపి నాని చేసిన వ్యాఖ్యలకు కేశినేని చిన్నిగారు తన దైన శైలిలో గట్టిగా సమాధానం చెప్పారు. అంతేకాదు ఎంపి నాని విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశ చూపి వసూలు చేసిన వ్యక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆధారాలతో నిరూపిస్తా అంటూ చిన్ని హెచ్చరించారు..
కేశినేని చిన్ని విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు..
ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ”ఎంపి నాని టిడిపి లో వున్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ చేశాడు… ఒక ఉసరవెల్లిలా కోర్టు హాల్ లో వికృత చేష్టలు చేశాడు..అక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు సైకో జగన్ కి ఇన్పర్మేషన్ అందించాడు..ఈ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ జరిగి..జైలుకి వెళ్లినప్పుడు ..పూజలు చేసి లోకేష్ చేతికి రక్షా బంధనం కట్టి వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజు వారి పై ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గుండాలి..
గత ఎన్నికల తర్వాత ఎంపి నాని ఎన్ని గ్రామాల్లో పర్యటించాడో అధిష్టానానికి ప్రజలకు తెలుసు…ఈస్ట్ విజయవాడలో, మైలవరంలో ఎమ్మెల్యే టిక్కెట్స్ ఇప్పిస్తానని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. వీరిలో ఒక వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వగా మరో వ్యక్తి నాలుగు కోట్లు ఇవ్వటం జరిగింది.
ఈ ఆరాచకాలన్నీ తొందరలో బయటికి వస్తాయి. వీటికి సంబంధించిన ఆదారాలు కాల్ రికార్డ్స్ అన్నీ వున్నాయి. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను..నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తులు మీడియా ముందుకు త్వరలోనే వస్తారు..నువ్వు పెద్ద వసూలు రాజా అని ప్రజలకి అర్ధమైంది.
ఎవరైనా పచ్చగా వుంటే చూసి తట్టుకోలేని మనస్తత్వం ఎంపి నానిది. తన ప్రాణ స్నేహితుడ్ని రోడ్డు మీదకి పడేశాడు. తన కుటుంబ శుభకార్యాలకు డబ్బులు తీసుకుని ఇంత వరకు తిరిగి ఇవ్వలేదు. దీంతో అతను రోడ్డు మీదకు రావాల్సిన పరిస్తితి వచ్చింది.
ఇప్పటి వరకు అందరి దగ్గర నటించావు… ఇకపై నీ ఆటలు సాగవు. ప్రజలు ఈ ఎన్నికలే నీకు చివర ఎన్నికలు చేయటానికి సంసిద్దంగా వున్నారు. ..పిట్టల దొర ఎవరో రాబోయే రెండు నెలలో ప్రజలు నిర్ణయిస్తారు. పార్లమెంట్ లో , లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు, విజయవాడ కోర్టులో, చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో కోవర్ట్ ఆపరేషన్స్ చేసి నటించిన నాని … చంద్రబాబు టిక్కెట్స్ అమ్ముకుంటున్నారని,,,తెలంగాణ వెళ్లిపోతారని ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకునే అలవాటు నీకు మాత్రమే వుంది.
సైకో సీఎం జగన్ కి దాచుకోవటం..దోచుకోవటం…సామాన్యులను పీడించుకు తినటం బాగా అలవాటు..వైసిపి సిద్ధం అంటూ పోస్టర్స్ వేస్తే…వైసిపి నాయకులు టిడిపి లోకి వెళ్లిపోవటానికి సంసిద్దం అంటున్నారు. ఎంపి నాని తనకి ప్రజా బలం వుందని అపోహ పడ్డాడు..తనలో పాటు క్యాడర్ మొత్తం వస్తుందని ఊహించాడు..వైసిపిలోకి తనతో ఇద్దరు కూడా తీసుకువెళ్లపోయాడు..దీంతో జగన్ తనకి సీటు ఇవ్వడనే భయంతో…జగన్ అటెన్షన్ పొందెందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు.
పదేళ్లుగా ఎంపిగా పనిచేసిన నాని ఆఫీస్ కేశినేని భవన్ ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతుంది. ప్రజలు కూడా నానిని వ్యతిరేకిస్తున్నారు. ప్రజా బలం లేని నానికి సీటు ఇవ్వటం జగన్ కి కూడా ఇష్టం లేదు. ఎంపి నాని టిడిపి అధిష్టానం పైనే కాదు.. నందిగామ నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ తంగిరాల సౌమ్య పై ఆరోపణలు చేస్తున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్..నీ ఎడ్యుకేషన్ స్థాయి ఎంటనేది ఆలోచించుకోవాలి. ఆమె తండ్రి చనిపోతే ఆయన ఆశయాలు పూర్తి చేయటానికి ఉద్యోగాన్ని వదిలి ప్రజా జీవితంలోకి వచ్చింది. నీకు టిడిపిలో ఎవర్ని విమర్శించే స్థాయి అర్హత లేదు.
రాబోయే రెండు నెలలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది.అప్పడు జగన్ మోహన్ రెడ్డి తాడెపల్లి ఫ్యాలెస్..ఎంపి నాని కేశినేని భవన్ వదలిపెట్టి తెలంగాణ పారిపోతారు”. అని అన్నారు.