
రామగుండం మార్చి-24//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఎస్ఐ లుగా పదోన్నతి పొందిన అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోరే ఝా వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందని, మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని,వాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
