సకాలంలో ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
*రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
*ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూముల సర్వే అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్
పెద్దపల్లి, నవంబర్ -12:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ధర్మారం మండలంలో చేపట్టిన ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంగళవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ హర్ష తో కలిసి ధర్మారం మండలంలోని ప్రభుత్వ భూముల సర్వే, ధాన్యం కొనుగోలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ధర్మారం మండలంలోని భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్ భూమి పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియను చేపట్టామని అన్నారు. ధర్మారం మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్ తెలిపారు.
ధర్మారం మండలం పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వ విప్ అధికారులకు సూచించారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం కోత ఎక్కడ జరగడానికి వీలు లేదని అన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యత ప్రమాణాలు పరిశీలించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఎప్పటికప్పుడు జరగాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు, గని సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, హమాలీల కొరత ఎక్కడ రాకుండా చుట్టుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వేణు, డి. సి. ఓ.శ్రేమాల, ఏ . డి.సర్వే శ్రీనివాస్,ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App