TRINETHRAM NEWS

Salaar Box Office : ప్ర‌భాస్ స‌లార్ సెన్సేష‌న్..రూ. 542 కోట్ల‌తో వ‌సూలు

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌లార్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన ఈ మూవీ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. వ‌సూళ్లను తిర‌గ రాస్తోంది. డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల ప‌రంగా విస్తు పోయేలా చేస్తోంది. డైరెక్ట‌ర్ డైన‌మిజం ప్ర‌భాస్ మేనియాను తెర మీద ప్ర‌తిఫ‌లించేలా చేయ‌డంతో అభిమానులు బారులు తీరారు. సినిమా కోసం క్యూ క‌డుతున్నారు.

ఈసారి బాక్సులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. స‌లార్ చిత్రానికి సంబంధించి వ‌సూళ్లు ఇలా ఉన్నాయి. 1వ రోజు రూ. 176.52 కోట్లు , 2వ రోజు రూ. 101.39 కోట్లు, 3వ రోజు రూ. 95.24 కోట్లు, 4వ రోజు రూ. 76.91 కోట్లు వ‌సూలు అయ్యాయి.

స‌లార్ 5వ రోజు రూ. 40.17 కోట్లు, 6వ రోజు రూ. 31.62 కోట్లు , 7వ రోజు రూ. 20.78 కోట్లు కొల్ల‌గొట్టింది. మొత్తంగా రూ. 542.63 కోట్లు సాధించి సినీ ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. మ‌రో వైపు దీనికి పోటీగా వ‌చ్చిన షారుక్ ఖాన్ న‌టించిన డుంకీ మూవీ మెల మెల్ల‌గా రూ. 250 కోట్ల‌ను దాటేసింది.