
Trinethram News : రాజమహేంద్రవరంఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ తరలింపు
- జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
బుధవారం మధ్యాహ్నం స్ధానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగు మెటీరియల్ తరలింపు ను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని 92 పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్, సిబ్బంది 15 రూట్ లలో పంపించడం జరిగిందన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యూటరీ , నాన్ స్టాట్యూటరీ ఫారాలను ఆయా పొలింగ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 92 పొలింగ్ కేంద్రాలకు 15 రూట్ ల ద్వారా పొలింగ్ కేంద్రాలకు సిబ్బందికి, మెటీరియల్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పొలింగ్ నిర్వహించే సిబ్బంది , భద్రతా సిబ్బంది ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవడం జరిగిందన్నారు.
సజావుగా ఎన్నికలు నిర్వహణ కోసం ప్రిసైడింగ్ , సహాయా ప్రిసైడింగ్, ఇతర పొలింగ్ సిబ్బంది వారికీ నిర్దేశించిన పోలింగు కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగు మెటీరియల్ తో వెళ్లడం జరిగింది అని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో పోలీస్ బందోబస్తు నడుమ లోఅయా పోలింగు కేంద్రాలకు తరలి 5వెళ్లినట్లు తెలియా చేశారు. ఉదయం 8 గంటల సాయంత్రం 4.00 గంటవరకూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు పోలింగు కేంద్రము వద్ద క్యూ లైన్ లో ఉన్న అందరికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 62,970 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఓటు హక్కును వినియోగించు కోనున్నట్లు కలెక్టర్ తెలిపారు
ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ, సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు 400 మంది పోలీసులు నియమించడం జరిగిందన్నారు.
సహయ రిటర్నింగ్ అధికారి టి సీతారామ మూర్తి , ఆర్డీఓ కృష్ణ నాయక్, తహసిల్దార్ పాపా రావు , పొలింగ్ సిబ్బంది, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
