Police surprise checks at Bellampally railway station
నేరాలు నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా
బెల్లంపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి), మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పర్యవేక్షణ లో బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జలోద్దీన్ , బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ళగురిజాల ఎస్ఐ నరేష్ కుమార్, ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాగ్ తో అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిసరాలు, అనుమానాస్పద వస్తువులను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు.
సందర్భంగా పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు. పార్సిల్ ఆఫీస్, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ ఏరియా తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లో ఆగిన రైలు లలో మరియు స్టేషన్ పరిధిలో ఉన్న హోటళ్లు తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘా ఉంటుంది అని దానిలో భాగంగానే ఈరోజు రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని సిఐ తెలిపారు.
గంజాయ్, డ్రగ్స్ వాడడం వల్ల వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది వ్యసనాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటూ మత్తు కోసం అడ్డదారులు తొక్కుతూ జల్సా జీవితం కోసం సులభంగా డబ్బులు సంపాదించాలని అక్రమ మార్గంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ అమాయక యువతను చెడు మార్గాల వైపు మళ్ళించి గంజాయి కి బానిసలుగా చేస్తున్నారన్నారు. అలాంటివై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు.
ఇట్టి తనిఖీల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జిఆర్పి సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App