TRINETHRAM NEWS

Trinethram News : మెదక్ జిల్లా: మార్చి 19
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ రైటర్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఓ కానిస్టేబుల్

మెదక్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సురేందర్ మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు వద్ద లంచం డిమాండ్ చేశాడు.

ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో సురేందర్ రూ.15 వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

పక్కా ప్రణాళికతో అధికా రులు రెడ్ హ్యాండెడ్ గా సురేందర్ పట్టుకున్నారు…