రామగుండంలో ప్రజపాలనకు బదులుగా పోలీస్ పాలన నడుస్తోంది
ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారు
బిఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ,అక్రమ కేసులు పెడుతున్నారు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ ఎంఎల్ఏ పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
రామగుండం లో ప్రజపాలనకు బదులుగా పోలీస్ ర్యాజం పోలీస్ పాలన నడుస్తుందని,
రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తూ బిఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రామగుండం మాజీ ఎంఎల్ఏ కోరుకంటి చందర్ ధ్వజం మెత్తారు. అదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజాపాలన బదులు పోలీస్ పాలన, నియంత పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతిపక్ష పార్టీగా నిరసన కార్యక్రమం చేపట్టకుండా పోలీసులతో తమను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటూ, దాడులు చేస్తూ తమపై కేసులు పెడుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తమ మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ ఎమ్మెల్యే ప్రోద్బలంతో మహిళా కార్పొరేటర్లపై కేసులు పెట్టించడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా కార్పొరేటర్లను, దళిత మహిళలను సీఐ దుర్బాలాడడం దుర్మార్గమని అన్నారు. ట్రస్ట్ కు సంబంధించిన భూమిలో ఆలయాన్ని నిర్మాణం చేయాలని పూనుకుంటే ఎమ్మెల్యే తనకు సంబంధించిన వ్యక్తితో తమపై, తన తండ్రిపై, అక్కడ ఉన్న వారిపై పెట్రోల్ పోసి హత్యచేయాలని చూసారని అయినా పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు పెట్టకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీస్ పై అధికారులు చర్యలు తీసుకోకపోతే IG వరకు వెళుతామని అప్పటికి న్యాయం జరగకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు అంతర్గo మాజీ జెడ్పీటీసీ అముల నారాయణ, కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణీ,కవితా సరోజినీ నాయకులు నూతి తిరుపతి,పిల్లి రమేష్, బోడ్డు రవీందర్ నారాయణదాసు మారుతి అచ్చే వేణు తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ జహిద్ పాషా నీరటి శ్రీనివాస్ కిరన్ జీ రమ్య యాదవ్,ముద్దసాని సంద్యారెడ్డి,గుర్రం పద్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App