TRINETHRAM NEWS

రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

రామగుండం లో ప్రజాపాలన కాదు పోలీస్ పాలన సాగుతోందని

రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బార్ అసోసియేషన్ సభ్యులు నాంతాబాద్ కిరణ్ జీ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ పిలుపుమేరకు న్యాయవాదులు విధులను బహిష్కరించాగా వారికి రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగుండం నియోజకవర్గం లో పోలీస్ రాజ్యం నడుస్తోందని …అంతర్గాం S.I బి.ఆర్.ఎస్ పార్టి నాయకులను పార్థి మారకపోతే కేసులు పెడుతూ బెదిరిస్తున్నడని, ఇక్కడ గోదావరిఖని వన్ టౌన్ C.I కి దొంగలను పట్టుకోవడంలో శర్ద లేదని గంజాయిని నియత్రించడం లేదని ఇక్కడ మర్డర్ల జరుగుతుంటే వాళ్లని పట్టుకోవడం చేతకావడం లేదని విమర్శించారు.

ఒక కేసు విషయానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాది కిరన్ జీ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తిస్తూ కనీస గౌరవం లేకుండా దూషించడం సరైనది కాదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు మురళిధర్ రాకం వేణు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police rule is running