Police Darbar : సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్

TRINETHRAM NEWS

విధుల్లో నిర్లక్ష్యం వద్దు అందరం సమన్వయంతో కలిసి పని చేద్దాం

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం కు సీపీ హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది తో మాట్లాడి సమస్యలను, వినతిలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకొని సమస్యలను వెంటనె పరిష్కరించే విధముగా చూస్తాం అన్నారు. ఏలాంటి సమస్య ఉన్న దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చు అన్నారు
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ మనమందరం ఒక కుటుంబం. అందరం సమన్వయంతో క్రమ శిక్షణ, ప్రణాళికబద్దంగా డ్యూటీ లను నిర్వర్తించాలని రామగుండం కమిషనరేట్ కి, తెలంగాణ పోలిస్ మంచిపేరు తీసుకురావాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచిప్రవర్తన తో విధులు నిర్వర్తించినప్పుడు అదికారులు తమ వెంట ఉంటామన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు, ఆదేశాలు చేయడం జరిగింది. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్ట కి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖ పరమైన చర్య తీసుకొవడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ మరియు యూనిఫామ్ మీద ఉంటే చట్ట వ్యతిరేకమైన పనుల మీద ఆలోచన రాదు అన్నారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోండి. మానసిక శారీర ఒత్తిడి నుండి దూరం కావచ్చు అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ గురించి ఆలోచించాలని సూచించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు నిర్వహించి సిబ్బంది అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది అన్నారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్,వామన మూర్తి, సంపత్, ఆర్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top