TRINETHRAM NEWS

మంచిర్యాల మార్చి-22//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జోన్ మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. నాగరాజు హెచ్ సి.444 గుండెపోటుతో మరణించగా ఆయన భార్య విజయ కుమారి కి భద్రత ఎక్స్గ్రేషియా 7,84,762/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తన కార్యాలయంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఓ శ్రీనివాస్ , సూపరిండెంట్ సంధ్య, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police Commissioner Amber Kishore