TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు ఈరోజు రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన పోచమ్మ బొడ్రాయి ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు గ్రామ దేవతలకు సంబంధించిన పూజలు ఘనంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, “జానపద దేవతల పూజలు మన సంప్రదాయాలకు మూలస్థంభాలు. ఇలాంటి ఉత్సవాలు భక్తి భావాన్ని పెంపొందించి, మన సంస్కృతిని తరతరాలకు అందించేందుకు దోహదపడతాయి ప్రజల ఐక్యతను చాటిచెప్పే ఈ వేడుకలు, అనేక సాంస్కృతిక విలువలతో నిండి ఉంటాయి,” అని వ్యాఖ్యానించారు అలాగే, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ప్రస్తావిస్తూ, అందరికీ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరి అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు ఈ వేడుకకు వచ్చి, పూజలో పాల్గొన్న భక్తులు దేవతకు తాము పునీతులయ్యామని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. నానాటికీ పోచమ్మ బొడ్రాయి ఉత్సవం మరింత ఆకర్షణీయంగా మారుతూ, అందరికీ ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు
కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, భారీ ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pochamma Bodrai Utsavam