
Trinethram News : రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోల్లర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు పెట్రోలు బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొని మాట్లాడుతూ పెట్రోల్ బ్యాంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు త్రాగునీరు, మరుగుదొడ్డి, గాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు ఉచితంగా అందించాలని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలు, డెన్సిటీ మరియు కొలత పరిశీలించుకోవాలని వినియోగదారులకు సూచించారు. సేవల్లో, నాణ్యతలో లోపాలుంటే కంపెనీ సేల్స్ ఆఫీసర్ కు లేదా జిల్లా సివిల్ సప్లై అధికారి లేదా లీగల్ మెట్రాలజీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. మోసపోయిన వారు వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారులు, పెట్రోల్ బంక్ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
