
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగఅవకాశం కల్పించండి
Trinethram News : రాజమహేంద్రవరం,మార్చి 1: చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నన్నయ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్,కాంట్రాక్టు పద్ధతిలో కాని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు క్రొత్తగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ కి విజ్ఞప్తి చేశారు. ఆచార్య ప్రసన్నశ్రీని మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం ప్రతినిధులు పుష్పగుచ్చం,శాలువాతో సత్కరించి జ్ఞాప్తిక అందచేశారు.అనంతరం ఆమెకు ఒక వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంఘం తరుపున నిరుద్యోగులకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఉన్నత చదువులు చదివిన బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే విశ్వవిద్యాలయం అభివృద్ధి సలహామండలిలో కూడా తమకు అవకాశం కల్పించాలని కోరారు.వీసీని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కుసుమ. సాయిబాబా, గౌరవ అధ్యక్షుడు బి. జార్జ్ ఆంథోనీ వ్యవస్థాపకుడు డి.ఆర్.ఎన్.ఠాగూర్, కార్యదర్శి బి. రాజు, సంయుక్త కార్యదర్శి, కే.శ్యాంకుమార్, కోశాధికారి:కె. ఆశాలత తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
