గిరీ పేదల గుడు కోసం హౌసింగ్ కార్యాలయం ముట్టడి ..
తహసీల్దార్ కు వినతి పత్రం!
అరకు లోయ త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్, జనవరి 23.
ఈ కార్యక్రమం నిర్దేశించి సిపిఎం పార్టీ మండల నాయకులు గెమ్మెలి చిన్నబాబు మాట్లాడుతూ,
ఆదిమ జాతి గిరిజనులైన పీఎం జన్మన్ 2,39,000 తో హౌసింగ్ మంజూరు చేసి ఉన్నారు. గిరిజన ప్రాంతంలో గౌరవంగా ఒక కుటుంబం జీవించాలంటే ఇల్లు నిర్మాణం కొరకు సుమారు ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం పీఎం జన్మన్ ఇల్లులకు రెండు లక్షల 39,000 తో ఇల్లు పూర్తి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇసుక ఐరన్ తాపీ మేస్త్రీల కూలీలు ఇతర ముడి సరుకులు రేట్లు విపరీతంగా పెరగడం వలన ఇల్లు పూర్తి చేయడం కలగా ఉంది. ఉన్న గుడిసె తొలగించి ఇల్లులు కట్టుకోవాలని బేస్మెంట్ మొదలుపెట్టిన వారు ఇల్లు నిర్మాణానికి పెట్టుకున్న కూలీలకు కూలి ఇవ్వడానికి డబ్బులు లేక, భూములు అమ్ముకుంటున్న పరిస్థితి ఏజెన్సీలో ఉన్నాయి.
ఇల్లు స్థలాలు లేక ఉన్న ఇల్లు తొలగించి ఇల్లు నిర్మిస్తున్న బాధితులు అయోమయంలో ఉన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పీఎం జన్మన్ హౌస్ నిర్మాణం పూర్తి చేయుటకు కనీసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయవలసి ఉంది. పీఎం జన్మన్ హౌసింగ్ యూనిట్ ఐదు లక్షలు పెంచకపోతే ఏజెన్సీలో నిర్మిస్తున్న ఇల్లులు ముండిగోడలుతో మిగిలే ప్రమాదం ఉంది.
తెల్ల రేషన్ కార్డు దారులకు గత ప్రభుత్వ ఆయాంలో ఇళ్ల పట్టాలు తీసుకొని మోసపోయి ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
గిరిజన ప్రాంత ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామాల్లో పర్యటించి పీఎం జన్మన్ హౌసింగ్ నిర్మాణ పనులు లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకుని ఇల్లు పూర్తి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు నాయకులు జి .బుజ్జి బాబు జి.సత్యరావు ,పెసా కార్యదర్శి నితీష్ రాజశేఖర్ , కె .ఆనంద్ బి. శేసయ్యా,మత్య బాబు, శ్రీను, విజయలక్ష్మి ,దేవి, చిలకమ్మ, తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App