ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2025 01 28 at 18.59.26

TRINETHRAM NEWS

ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులపై వినతిపత్రం అందజేత

త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి

ముత్తారం మండలంలోని 14 గ్రామాలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్,ఫెస్టిసైడ్స్ షాపుల యొక్క లైసెన్స్ లు రెన్యువల్ సంబంధించి, రైతు కొనుగోలు చేసే ప్రతి ఖరీదు పై రశీదు ఇవ్వడం పట్ల సదరు షాపు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు.అంతేకాకుండా ధరల పట్టికలు, నిలువ ఉన్న ప్రొడక్ట్ లు, షాపుల్లో డిస్ ప్లే పెట్టకుండా ఆశ్రద్ధ వహిస్తున్నారు. రైతులకు ఇచ్చేటువంటి రసాయనిక ఎరువులను ఎప్పుడు ఏ విధంగా వాడాలో తెలియజేయకుండానే రైతులకు విక్రయిస్తున్నారు.

కొన్ని షాపుల్లో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది అని, అదేవిధంగా షాపుల్లో పాటించవలసిన నియమ నిబంధనలు పాటించేలా, లైసెన్స్ లేని షాపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ట్ర రైతుసంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగిలి కిరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిగురు విద్యాసాగర్ రావు లు మంగళవారం ముత్తారం మండల వ్యవసాయ శాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా వినతిపత్రం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారి అనూష ఎటువంటి నియమ నిబంధనలు పాటించని ఫెర్టిలైజర్ షాపులపై తగిన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page