TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా

శ్రీకాకుళం: పెండింగ్ లో ఫారంలు త్వరగా డిస్పోజ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోరల్ తొలగింపులు, చేర్పులు, మార్పులు, పోలింగు సిబ్బంది, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ఆయన సమీక్షించారు.

జిల్లా నుండి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, తదితర వాటిపై రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారికి వివరించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్, పోలింగ్ సిబ్బంది గూర్చి తెలిపారు. ఆర్ఓలు, ఎఆర్ఓలు, మాస్టర్ ట్రైనర్స్ కు జిల్లా స్థాయిలో శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు.

జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఉన్న పరిస్థితులను రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారికి వివరించారు. బోర్డర్ వద్ద చెక్ పోస్టుల ఏర్పాట్లు, బోర్డర్ వద్ద పరిస్థితులు, పోలీసులకు ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్స్ పోలీసు అధికారులకు మూడు రోజులు పాటు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అవసరమనుకుంటే రిటైర్డ్ పోలీసులు, ఎక్స్ ఆర్మీని వాడుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ఆదేశించారు.

జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.