Payment of profit share to workers as a result of AITUC struggle
జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలి
AITUC బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ జీ డిమాండ్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో రాజీలేని పోరాటాల తో ఎన్నో త్యాగాలు చేసి , ఎన్నో అక్రమ కేసులు భరించి ఈరోజు లాభాల లో వాటా సాధించుకోవడం జరిగిందని, కార్మికుల మరియు AITUC పోరాటాల ఫలితంగానే ఈ హక్కు సాధించుకోవడం జరిగిందని AITUC బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు.
శనివారం నాడు గోలేటిలో సింగరేణి కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ – AITUC ఆధ్వర్యంలో కార్మికులు స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా AITUC బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ జీ మాట్లాడుతూ AITUC సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే కార్మికులకు 33% లాభాలలో వాటా కాంట్రాక్టు కార్మికులకు 5000 రూపాయలు చెల్లించడం జరుగుతుందని అన్నారు
కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని గత 20 సంవత్సరాల నుంచి AITUC ఆధ్వర్యంలో ఎన్నో రాజీ లేని పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేశామని గుర్తు చేశారు
సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లాభాల లో వాటా చెల్లించేందుకు కృషిచేసిన భారత కమ్యూనిస్టు పార్టీ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం మ్మెల్యే కూనం నేని సాంబశివ రావు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని బోగె ఉపేందర్ జీ డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో AITUCయూనియన్ సభ్యులు కార్మికులు భీమేష్ చందు ఇప్ప భీమయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.