పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది.
తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు.
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు.
అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.