TRINETHRAM NEWS

చరిత్ర పురుషుడు పట్టాభి
మహాత్మా గాంధీ సమకాలీకులు

భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో అగ్రశ్రేణికి చెందిన జాతీయ నాయకులలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు నేడు 64 వ వర్ధంతి 1959 డిసెంబర్ 17 పరమపదించారు.చిరస్మరనీయుడు వారిని స్మరించుకుంటూ 1913 లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేసింది.1927లో కాంగ్రెస్ సమావేశం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ ఒక తీర్మానం చేసింది.1931లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైన సందర్భంలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర డిమాండును చర్చించాలని పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కి మూడేళ్లు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ కి రెండేళ్లు అధ్యక్షుడిగా పనిచేశారు మచిలీపట్నం కేంద్రంగా 1923లో ఆంధ్రా బ్యాంకును స్థాపించిన,ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని కృష్ణాజిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్,ఆంధ్ర బ్యాంకు నెలకొల్పిన వారు పట్టాభి గారే అంతకుముందు ఆంధ్ర జాతీయ కళాశాలను నెలకొల్పడంలో కీలకపాత్ర నిర్వహించిన పట్టాభిని తలుచుకుంటే ఆంధ్రులు ఎవరికైనా గౌరవంతో ఒళ్లు పులకరిస్తుంది.1952 నుండి 57 వరకు మధ్యప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు.ఆయన స్థాపించిన ఆంధ్ర బ్యాంకు పేరును బిజెపి మార్చివేసింది ఆయన పేరుతో నిర్మించదలచిన స్మారక ఆడిటోరియం స్థలాన్ని వైసిపి ఆక్రమించింది అత్యంత బాధాకరం వారిని స్మరించుకుంటూ నమస్సుమాంజలి.