
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అరకువేలి ఏప్రిల్ 6: అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచి పెంట శాంతకుమారి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదేల.పవన్ కళ్యాణ్ తేదీ 7.4.2025న రాక .స్వాగతం. సుస్వాగతం, సాధారంగా కాంగ్రెస్ పార్టీ నుండి హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
అయ్యా ఉపముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల ప్రధాన సమస్యలు కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 100% రిజర్వేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ జీ ఓ నెంబర్ 3ను. చట్టబద్ధత కల్పించాలి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు తొలి సంతకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 1200 మంది హెల్త్ వాలంటరీలను రెవెన్యూవల్ చేయాలి. అనంతగిరి చింతపల్లి మండలాలలో హైడ్రోపార ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి.
1/70 చట్టం జిల్లా అధికారులు నిర్మీరియం చేస్తున్నారు, పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్రంలో ఐటీడీఏల్లో తక్షణమే పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలి, బ్యాక్ లాగ్ పోస్టులు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం నాన్ షెడ్యూల్ ఏరియా5 పంచాయతీలు. ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రాంతంలో కలపాలి భారీ భూ మాపియా జరుగుతుంది. అరికట్టాలి
ఈ సమస్యలు తక్షణమే గిరిజన ప్రజానీకానికి న్యాయం చేయాలని గిరిజనుల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి తమకు డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అల్లూరి జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్ కుమార్,అరకువేలి మండల అధ్యక్షులు పాంగి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓలేసి బాబురావు, కోర్రమితుల, పాచిపెంట మాలతి, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
