
మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేత
Trinethram News : అమరావతిః కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ అదవానీ ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు విరాళం అందజేసిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
