TRINETHRAM NEWS

బీటీ రోడ్డు పనులు శంకుస్థాపన చేసిన పాడేరు శాసనసభ్యులు, – మత్స్యరాస విశ్వేశ్వర రాజు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : బీటి రోడ్డు పనులు శంకుస్థాపన చేసిన పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.
ఘనంగా స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టిన పంచాయితీ ప్రజలు.

పాడేరు మండలం,ఐనాడ పంచాయితీ, మారుమూల గ్రామం రాయిపాలెం నుండీ గాతపనుకు వరకు MGNREGS నిధులతో 6 కోట్ల రూపాయలు తో నాలుగున్నర కిలోమీటర్లు మేరకు బీటి రోడ్డుని శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
శాసన సభ్యులు మాట్లాడుతూ మండలంలో కొన్ని గ్రామాలకు రోడ్లు, మరియు త్రాగునీటి సమస్యలు చాల ఉన్నాయి. కావున, ఎమ్మెల్యే గా నా వంతు తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మారుమూల గ్రామాల్లో చాలా వరకు రోడ్లు మంజూరు చేసి చాలా అభివృద్ధి సంక్షేమం కల్పించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారం కోసం అడ్డగోలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు అడ్డంగా మోసం చేశారు. ఎవ్వరు బాధ పడకండి మళ్లీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, జగనన్న ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలతో, పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు. అని శాసన సభ్యులు చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీధరి మంగ్లన్న దొర, మండల పార్టీ అధ్యక్షులు సీధరి రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతురు కనకలమ్మ, స్థానిక సర్పంచ్ తూపురు ఎర్రయమ్మ, స్థానిక ఎంపీటీసీ జిరుగు బోయిన భిమలమ్మ, మాజీ ఏఎంసి చైర్మన్ కూతంగి సూరిబాబు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు శరభ సూర్యనారాయణ, నియోజకవర్గ గ్రీవెన్ సెల్ అధ్యక్షులు దూసురు గంగరాజు, సలుగు ఎంపీటీసీ చిప్పడ మీనాక్షి,

ఎంపీటీసీలు: గిడ్డి విజయలక్ష్మి , సల్ల చిట్టమ్మ దూసురు సన్యాసయ్య, మాజీ సర్పంచులు , పాంగి నాగరాజు, మినుముల కన్న పాత్రుడు, పీసా కమిటీ వైస్ ప్రెసిడెంట్ ధన్నేటి పలాసి రాంబాబు,సీనియర్ నాయకులు తూపురు గంగరాజు, వంతాల నరేష్ బాబు, మాజీ PACS ఛైర్పర్సన్ లకే రామ సత్యవతి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Matsyarasa Visvesvara Raju