మన ఊరు మన ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం24.1.25.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 1 వ వార్డ్ లో ” మన ఊరు -మన ఎమ్మెల్యే” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వార్డ్ లోని సమస్యలను తక్షణమే పరిష్కరించడమేనని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ఒకటో వార్డులో అధికారులతో నాయకులతో కలసి పర్యటించడం జరిగిందని * *ముఖ్యంగా ఒకటో వార్డ్ లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని ఈరోజు సాయంత్రానికి డ్రైనేజీ పరిశుభ్రం చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
*ఇక రెండవ సమస్య పంట కాలువ పూర్తిగా డ్రైనేజీతో వ్యర్ధాలతో నిండిపోయి ఉందని దాంతో వార్డు లో తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నదని, వార్డ్ ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని దీనిక శుభ్రం చేయడానికి తక్షణమే టెండర్లు పిలుస్తున్నామని అన్నారు.
*మూడవ సమస్య అక్కడక్కడ త్రాగునీటి సమస్య ఉన్నదని వార్డ్ ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చారు అని గతంలో కాంట్రాక్టు చేసిన వారు అసంపూర్తిగా పూర్తి చేశారని తక్షణమే ఆ కాంట్రాక్టర్లను పిలిచి దాన్ని పూర్తి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App