జూలై 7, 2026

WhatsApp Image 2024 02 04 at 6.47.57 PM

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రతిఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా, రమేష్, అరవింద్, వీరబాబు, టేకుల ప్రవీణ్ రెడ్డి, మహేష్, శ్రీశైలం యాదవ్, రఫాత్, అమృత రావు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

You cannot copy content of this page