
కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ కి చెందిన కావ్యాంజలి,24 సంవత్సరాల యువతి గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోగా అప్పటి నాయకుల నిర్లక్ష్యంతో బాధితురాలు కావ్యాంజలి కి చెక్కు రావడానికి ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కావ్యాంజలి గురించి తెలుపగానే వెంటనే హైదరాబాద్ లోని సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్ అధికారులతో,ఫోన్ లో మాట్లాడి చెక్ ను రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తెప్పియడం జరిగింది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గురువారం రోజున మడిపెల్లి మల్లేష్ బాధితురాలు కావ్యాంజలి కి చెక్ ను అందజేశారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ
కావ్యంజలి,గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో మెరుగైన వైద్యం కోసం హాస్పటల్లో వైద్యం చేసుకోని ఆర్థికంగా చితికెలపడి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంటే గత పాలకుల నిర్లక్ష్యం తో కావ్యంజలి చెక్ రావడం జాప్యం జరిగిందని రాజ్ ఠాకూర్ అన్నకు తెలుపగానే వెంటనే స్పందించి కావ్యాంజలికి సంబంధించిన చెక్ తెప్పించి
నా ద్వారా బాధిత యువతికి చెక్ అందజేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు చెక్ అందజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా బాధితురాలు తరఫున మరియు రెండోవ డివిజన్ ప్రజల తరపున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు,
ఈ కార్యక్రమంలో.రెండోవ డివిజన్ సోషల్ మీడియా ఇంచార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, చెందు,తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
