TRINETHRAM NEWS

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో

తుఫిడీసీ నిధులతో భరత్ నగర్ బోర్డు నుండీ పికె రామయ్యా కాలని బస్టాండ్ వరకు సీసీ రోడ్ల పనులు ప్రారంభం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భరత్ నగర్ బోర్డు నుండి పీకే రామయ్య కాలనీ బస్టాండ్ వరకు పనులు ప్రారంభం
టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుండి గత కొద్ది రోజుల క్రితం నిధులు కేటాయించి ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్ లో 6 డివిజన్ లకు కలపి ఓకే దగ్గర రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రోడ్ల పనుల కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసింది అందులో భాగంగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సోమవారం రోజున రోడ్డు పనులు ప్రారంభించినట్లు రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూగత 15 సంవత్సరాల క్రితం వేసిన సిసి రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఆ దారిన వెళ్లే ప్రజలకు మరియు ఆటోలో వెళ్లే ప్రయాణికులకు స్కూల్ పిల్లలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రయాణం చేయడంలో చాలా ఇబ్బంది అవుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుక వెళ్ళగా సంబందించిన కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో రోడ్లు పనులు ప్రారంభించారని మల్లేష్ తెలిపారు గత పాలకుల నిర్లక్ష్యంతో రెండో డివిజన్ అభివృద్ధికి నోచుకోలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మా డివిజన్ కు మంచి రోజులు రాబోతున్నాయని మల్లేష్ ఆనందం వ్యక్తం చేశారు రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గెలిచిన నుండి రెండోవ డివిజన్ లో మార్పు మొదలైందని ఇప్పటికే ఇందిరమ్మ కాలనీ లోనీ సబ్ స్టేషన్ మెయిన్ రోడ్డు ఎన్టీపీసీ CSR ద్వారా సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయినాయని,తుఫిడీసీ నిధులతో
పోచమ్మ గుడి ఇరు వైపుల 22 గల్లీలో సీసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించారని, మల్లేష్ తెలిపారు గత పాలకుల నిర్లక్ష్యంతో వీధి లైట్లు లేక చీకటిలో గడిపిన ఇందిరమ్మ కాలనీ సబ్ స్టేషన్ ఏరియా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ అడిషనల్ కలెక్టర్ తెలిపిన వెంటనే సబ్ స్టేషన్ ఏరియా లోని ప్రతి గల్లీలో వీధిలైట్లు పెట్టియ్యడం జరిగిందని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందించాలని 40 లక్షల రూపాల బడ్జెట్ తో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గెలిచిన నెల రోజులకే బడ్జెట్ పెట్టడం జరిగిందని మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తిగా అయినయని,గత 15 రోజుల నుండి ప్రతి ఇంటికి మంచి నీళ్ల కనెక్షన్ ఇస్తున్నామని మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఎన్నికల ప్రచార సమయంలో రెండో డివిజన్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గా గెలిచాక మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం రెండో డివిజన్ లో అభివృద్ది పనులు మొదలు అయినాయని ఎన్నో సంవత్సరాల నిరీక్షణ రోడ్లు పనులు మొదలు కావు అని నిరాశతో ఉన్న మా డివిజన్ ప్రజలకు, పీకే రామయ్య కాలనీ మెయిన్ రోడ్డు మరియు సబ్ స్టేషన్ మెయిన్ రోడ్డు మంజూరు చేసి రోడ్డు వేస్తున్నందుకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ శ్రీ అడిషనల్ కలెక్టర్ మా రెండవ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App