డిసెంబర్ 14న కామన్ డైట్ కార్యక్రమం లంచ్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*పిల్లల తల్లిదండ్రులు కామన్ డైట్ లంచ్ కార్యక్రమానికి హాజరు కావాలి
*కామన్ డైట్ మెనూ అమలు పై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
డిసెంబర్ 14న జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఆశ్రమ పాఠశాలలు మోడల్ స్కూల్స్ లలో కామన్ డైట్ కార్యక్రమం లంచ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెన్యూ కార్యక్రమం లంచ్ ఉంటుందని, విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తుందని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కామన్ డైట్ లంచ్ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ కోరారు.
ప్రతి హాస్టల్ లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 14న ఉదయం 11 గంటలకు విఐపి రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకుంటారని, 11 నుంచి 12 గంటల వరకు పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని, 12 నుంచి 12.30 గంటల వరకు పిల్లలతో ఇంటరాక్షన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అనంతరం కామన్ డైట్ ప్లాన్ సంబంధించిన బ్యానర్ ముఖ్య అతిథి చే ఆవిష్కరించి ప్రసంగిస్తారని, అనంతరం 1 గంటలకు ముఖ్య అతిథి, పిల్లలు పిల్లలు తల్లి దండ్రులతో పాటు భోజనం చేస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App