TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ప్రజలకు త్రాగునీరు అందించాలని దాదాపు 20 సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ CSR ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చెయ్యడం జరిగింది గత పాలకుల మరియు అధికారుల నిర్లక్ష్యంతో ఆర్వో ప్లాంట్ మెంటనెన్స్ లేకపోవడంతో ప్లాంట్ లోని మోటార్లు శిథిలావస్థకు గురికాగా ప్లాంట్ ను మరమ్మతులు చేపట్టి,ప్రజలకు అందుబాటులోకి తేవాలని కొన్ని రోజుల క్రితం మడిపెల్లి మల్లేష్ ఎన్టీపీసీకి లేటర్ ద్వారా తెల్పగా ఎన్టీపీసీ CSR అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్ మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయించి మున్సిపల్ కార్పోరేషన్ కు అందజేసినట్లు తెలిసింది,రామగుండం కార్పొరేషన్ అధికారులు టెండర్లకు పిలిచి కాంట్రాక్టర్ కు పనులు అప్పజెప్పానున్నట్లు విశ్వనీయంగా తెలిసింది,మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ,
పీకే రామయ్య కాలనీ ప్రజలు ఎన్టీపీసీ ప్లాంట్ మరియు ఇతర పరిశ్రమలో పనులు చేసుకొనే ప్రజలు పొద్దంతా కష్టపడి సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి త్రాగు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ చీకటిలో నీళ్ల క్యాన్ లు మోటార్ సైకిల్ మీద పెట్టుకొని నిత్యం ఎన్టిపిసి వెళ్ళి త్రాగునీళ్లు తేచుకోవడం జరుగుతుందని గతంలో మోటర్ సైకిల్ పై నీళ్లు తెచ్చుకునే క్రమంలో అనేక సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగి గాయపడ్డారని మడిపెల్లి మల్లేష్ తెలిపారు,డివిజన్ ప్రజలు త్రాగునీళ్ల కోసం పడుతున్న పరిస్థితిని
ఎన్ టి పి సి,సిఎస్ ఆర్, మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కలిసి పీకే రామయ్యా కాలనిలో నిరుపయోగంగా ఉన్నా ఆర్వో ప్లాంట్ ను రిపేర్ చేసి ప్రజల మంచి నీటి సమస్య తీర్చాలని ఎన్టీపీసి CSR అధికారులకు లెటర్ ద్వారా తెల్పగా ఎన్టీపీసీ వారు,మరియు రామగుండం కార్పొరేషన్ అధికారులు స్పందించి తొందర్లోనే ప్లాంట్ ను రిపేర్ చేసి రెండోవ డివిజన్ ప్రజలకు మంచి నీళ్ళు అందిస్తామని తెలపడం జరిగిందని నా లేటర్ కు స్పందించిన ఎన్టీపీసీ,అధికారులకు.మరియు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Officials of the Municipal