నాగారం గ్రామంలో నీటి ఎద్దడి 20 రోజులైనా పట్టించుకోని అధికారులు

TRINETHRAM NEWS

నాగారం గ్రామంలో నీటి ఎద్దడి 20 రోజులైనా పట్టించుకోని అధికారులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మన నాగారం గ్రామపంచాయతీ పరిధిలోగల ఎస్సీ కాలనీ మరియు ఫస్ట్ వార్డ్ పరిధిలోనీ ప్రాంతాల్లో వాటర్ సప్లై బోరు మొటర్ కాలిపోయింది, గత 20 రోజుల నుండి ప్రతి రోజు కనీస అవసరాల కోసం కోసం నీరు లేక గ్రామ ప్రజలు అల్లాడుతున్నారు, ప్రజలకు నీరు లేక మహిళలు చేతి పంపు వద్ద బారులు తీసి లైన్లు కట్టి కొట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది,
ప్రజలకు కనీస త్రాగునీరు లేకపోవడం బాధకారం నాగారం గ్రామపంచాయతీ సెక్రెటరీ , వాటర్ మాన్, పంచాయతీ సిబ్బంది, ఎవ్వరు కూడా పట్టించుకోవడం బాధాకరం నాగారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ గారు, పంచాయతీ సిబ్బంది ఇప్పటికైనా స్పందించి వెంటనే బోరు మోటారు రిపేరు చేయించి గ్రామ ప్రజలకు త్రాగునీటి అవసరములు తీర్చాలని కోరుతున్నాము,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top