NTR Chatti said that a ruler is a servant of the people
Trinethram News : యన్ టి ఆర్ 101వ జయంతి వేడుకల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగా వైభవంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి నేతలు అభిమానులు జరుపుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని యన్ టి అర్ భవనంలో తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నివాళులర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్న సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
నట విశ్వరూపం, తెలుగుజాతి ఆత్మగౌరవం.. జయహో ‘ఎన్టీఆర్
అమిలినేని సురేంద్ర బాబు ‘
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని అమిలినేని సురేంద్ర బాబు కొనియాడారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారని అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని గుర్తు చేశారు.
ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని సురేంద్ర బాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని కార్యకర్తలకు సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App